సర్వేయర్ పై దాడి…ఇద్దరిపై కేసు నమోదు
ప్రజాగొంతుక /పాపన్నపేట
భూమిని సర్వే చేసి తిరిగి వస్తున్న సర్వేయర్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…మండలంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న హహోబిలం శ్రీనివాస్ ఇదే మండలం యూసుఫ్ పేట గ్రామానికి చెందిన తీగల మల్లేశం అనే వ్యక్తి భూమిని సర్వే చేయడానికి బుధవారం యూసుఫ్ పేట గ్రామానికి వెళ్ళాడు.సర్వేచేసి తిరిగి వస్తుండగా గ్రామ బస్టాండ్ సమీపంలో అదే గ్రామానికి చెందిన ఎరుపుల శ్రీనివాస్, ఎరుపుల గంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు సర్వేయర్ బైక్ ను ఆపి భూతూ మాటలు తిట్టి చేతులతో, హెల్మెట్ తో ముఖంపై కొట్టారు.సర్వేయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.