ఆర్మీ జవాన్ మనోజ్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులపై ఎస్సి ఎస్టీ కేసుతో పాటు హత్యానేరం కేసు నమోదు చేయాలి
కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి :13
ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బుదాల మనోజ్ పై మొన్న రాత్రి చింతకాని పోలీస్ స్టేషన్లో దాడి చేసిన ఘటనపై దాడికి పాల్పడిన వ్యక్తిి పై ఎస్సి ఎస్టీ కేసుతోపాటు హత్యానేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను ఒక ప్రకటన విడుదల చేశారు కొండేటి శ్రీను మాట్లాడుతూ ప్రజలకు రక్షణ ఉండే పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు చూస్తుండగానే దళిత ఆర్మీ జవాన్ పై దాడి చేసి కులం పేరుతో దూషించిన గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు దేశ సరిహద్దుల్లో పని చేసిన వ్యక్తిని కులంపేరుగో దూషించడం పోలీసు స్టేషన్ లొనే దౌర్జన్యం చేయడాన్ని పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవలన్నారు ఇప్పటికే కేసులో ఉన్నటువంటి వ్యక్తి గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన మరో దళిత యువకులైనటువంటి కొందరు వ్యక్తులు నా కు మద్దతుగా వీడియోలో చెప్పకపోతే చంపుతాం అని బెదిరిస్తున్నాడని చెప్పారు. అరెస్టు చేయకపోతే ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు అరాచకవాది నుండి దళిత యువకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.