వేణుగోపాల స్వామి జాతర బ్రాహ్మోత్సవాలకు హాజరైన కేయం ప్రతాప్ గౌడ్
ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ( జాతర ) బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,కె.యం. ప్రతాప్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా
ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ…
శ్రీ వేణుగోపాలస్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త ఠాగూర్ రాజేందర్ సింగ్, ఠాకూర్ విజయేందర్ సింగ్, కుత్బుల్లాపూర్ గ్రామవాసులు నార్ల కంటి శ్యాం కుర్మా, కుంట వేణు ముదిరాజ్, రత్నం కిరణ్ కుమార్ గౌడ్, మొహమ్మద్ రషీద్, కోటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.