నీలిమ హాస్పిటల్ అంటే నియోజకవర్గ ప్రజలకు శ్రీరామరక్ష
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ప్రజల ఆపద బాంధవుడు , ఆరోగ్య బాంధవుడు మన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని మండల బిఆర్ఎస్ నాయకులు ఇర్రి రమణారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి, గంగం సతీష్ రెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, జితేందర్ రెడ్డి, ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, కనకయ్య గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ లో ఉన్న నీలిమ ఆసుపత్రిని సందర్శించి అందులో చికిత్స పొందుతున్న బచ్చన్నపేట మండల ,జనగామ నియోజకవర్గం ప్రజలను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు లక్షల వైద్యమును ఉచితంగా అందిస్తున్నందుకు నీలిమ మేడంకు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిఆర్ఎస్ నాయకులు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.