ఎండిపోతున్న పొలాలకు నీటిని అందించండి..
ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం
నాగిరెడ్డిపల్లె వీరన్నపేట నుంచి వెళ్లే కెనాల్ పక్కకు గల రైతుల పొలాలు పొట్ట దశలో ఎండిపోతున్నాయని నీటిని విడుదల చేయాలనిజనగామ లో నీటిపారుదల శాఖ ఈ ఈ ని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి కలసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజులలో పంపింగ్ చేసేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. బొమ్మకూరు డ్యామ్ లో పంపింగ్ చేయడానికి తగినంత మోతాదులో నీరు లేకపోవడం వల్ల తపస్ పల్లికి పంపిణీ చేయలేకపోతున్నామని తెలియజేశారు.బొమ్మకూరు నుంచి గానుగుపాడు వెళ్లే కెనాల్ గేటు తెరవడం వల్ల స్టోరేజ్ తగ్గిందని, అక్కడి గేట్ వాల్ పూర్తిగా ఆఫ్ చేశామనితెలియజేశారు.మూడు రోజులు చూసి మీరు పైప్ లైన్ మోటార్స్ ఆన్ చేయకపోతే వీరన్న పేట, చుంచనకోట, నాగిరెడ్డిపల్లె రైతులు అందరం కలిసి ధర్నాకి దిగాల్సి వస్తుందని రైతులు, బిఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డి తెలియజేశారు.