చెరువుల కుంటలు నింపడమే లక్ష్యంగా నీళ్లు విడుదల
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనల మేరకు బొమ్మకూరు రిజర్వాయర్ నుండి వస్తున్న నీటిని ఈరోజు తమ్మడపల్లి మరియు చిన్నరాంచర్ల కుంటలు మరియు పంట పొలాల్లోకి విడుదల చేయడం జరిగింది. అనంతరం తమ్మడపల్లి గ్రామస్తులు తెలిపిన వెంటనే స్పందించి నీళ్లు రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి కి మరియు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సానిక రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూల రాజిరెడ్డి, బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి రంగు అశోక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…