దళారులను నమ్మి వడ్లు అమ్మి మోసపోవద్దు….
కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లకు మద్దతు ధర..
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతన్న ప్రభుత్వం…..
వడ్ల కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కేట్ కమిటి చైర్మన్ నల్లా నాగుల శ్వేత వెంకన్న
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం, సల్వాపూర్, పడమటి కేశవాపూర్ గ్రామలలో వడ్ల కోనుగోలు కేంద్రాలను చేర్యాల మార్కేట్ కమిటి చైర్మన్ నల్లా నాగుల శ్వేత వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల మాటలు నమ్మి వడ్లను విక్రయించవద్దని, కొనుగోలు కేంద్రంలోని వడ్లను అమ్ముకొని ఏ గ్రేడ్ ధాన్యముకు 2320 సాధారణ ధాన్యముకు 2300, సన్నరకం ధాన్యం కు 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నను రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తడక లింగమూర్తి,పాల లక్ష్మీనారాయణ ,కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ అల్వాల ఎల్లయ్య , సాల్వపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ , బోయిని కొండ స్వామి హరిబాబు,, స్టేట్ మహిళా జనరల్ సెక్రెటరీ పిన్నింటి కావ్య ,మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎద్దు హరీష్ , కొడవటూరుగుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కొడవటూరుగుట్ట డైరెక్టర్ భాస్కర్, బోయిని కొండ స్వామి, చెవుల రాజేష్, గణేష్, అధికార్లు కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.