సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం…
కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు..
గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నగేష్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం అని గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నగేష్, చిన్నరామచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి లు అన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పూర్ణ అనిల్ రెడ్డి, సిరిపాటి భీమయ్య లకు అనారోగ్యంతో ఆసుపత్రి బిల్లులకు వేలలో డబ్బులు ఖర్చు కావడంతో జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వారు స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి 60 వేల రూపాయలు చెక్కును మంజూరు చేయించారు. ఈ చెక్కులను బచ్చన్నపేట మండల కేంద్రంలో వారికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తో కలిసి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్, నారాయణరెడ్డి, బాపూ రెడ్డి, పస్తంపోశయ్య ,గంగరబోయిన ఐలయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.