ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలకు……. ఆకారపు నరేష్ ఎంపిక
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:13
నల్లగొండ జిల్లా హాలియా:భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 18వ జాతీయ మహాసభలకు నాగార్జునసాగర్ నియోజకవర్గం, బంకాపురం గ్రామానికి చెందిన నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ ఎంపికయ్యారని ఒక పత్రిక ప్రకటన లో తెలియజేయడం జరిగింది
అనంతరం వారు మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం అనే లక్ష్యాలతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాల జెండాతో 1970లో ఎస్ఎఫ్ఐ సంఘం ఏర్పడ్డ కేరళ రాష్ట్రంలో జూన్ 27 నుండి 30 వరకు జరిగే ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలకు తనను ఎంపిక చేయడం గర్వించదగ్గమన్నారు ఈ మహాసభలలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్య రంగ సమస్యల గురించి ఈ జాతీయ మహాసభలో చర్చించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాల కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు సహకరించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు