సాల్వాపూర్ గ్రామంలో సంబరాలు…
మండలంలో మారుమూల గ్రామాని గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, సాల్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాని అంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాపరెడ్డి చిత్రపటాలకు బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకుడు మాాజీ సర్పంచ్ హరిబాబు గౌడ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాల్వాపూర్ గ్రామాన్ని పైలెట్ గ్రామపంచాయతీగా సెలెక్ట్ చేసి లబ్ధిదారులకు నాలుగు సంక్షేమ పథకాలు అందజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి , డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో మారుమూల గ్రామమైన సల్వాపూర్ గ్రామాన్ని గుర్తించి , పథకాలు అందరికీ అందించినందుకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్ ల ను శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, జిల్లెల్ల దయాకర్ రెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, గిద్దెల రమేష్, కోడూరి మహాత్మాచారి, మండల యువ నాయకుడు బోయిని కొండ స్వామి, నీల రమేష్ ,గ్రామ యూత్ అధ్యక్షుడు గీస సతీష్ ,కీసరి రమేష్, క్రోతోజు బాల్ చారి ,నడి గొట్టు శ్రీకాంత్, గర్నపల్లి ఆంజనేయులు, చీర్ల వెంకటమ్మ కుమార్ ,వల్లూరి మంజుల రవి, కుక్కలఐలయ్య పడాల చిన్న నరసయ్య, కొంచెం చంద్రయ్య, తీగుళ్ల హరిబాబు ,గర్నపల్లి నరేందర్, చీర్ల మహేష్ ,సింగారం బాలయ్య ,తీగుళ్ల కిష్టయ్య, బోయిన విగ్నేష్, మాస పేట నాగయ్య , కృష్ణ ,మహేష్, హరిబాబు, కడారి లింగమ్మ, సుశీల ,పార్వతమ్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.