కాంగ్రెస్ పార్టీ నాయకుడికి పరామర్శ
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట పట్టణ ఉపాధ్యక్షుడు గంధ మల్ల కిష్టయ్య తల్లి గంధమల్ల ఎల్లమ్మ అనారోగ్యముతో మృతిచెందగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సామాజికవేత్త జిల్లా సందీప్ వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి 50 కేజీల బియ్యం అందజేశారు.మృతురాలి కుటుంబ సభ్యులు జిల్లా సందీప్ కి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి, ప్రధాన కార్యదర్శి కర్రే నరేష్, సీనియర్ నాయకులు అల్వాల రమేష్, కొండ హరికృష్ణ, యూత్ ఉపాధ్యక్షులు పోచంపల్లి నాగరాజు, గంధ మల్ల జంపయ్య, దాచేపల్లి రాజయ్య, కూరాకుల రవి, కర్రీ రవికుమార్, అఖిల్ మాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.