రిజర్వాయర్లను సందర్శించిన గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మసాగర్, బొమ్మకూర్, వెల్దండ, గండిరామారం, కన్నబోయిన గూడెం రిజర్వాలను బచ్చన్నపేట సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కలిసి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుంటలు, చెరువులు నీళ్లతో కళకళలాడాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు కుంటలు నింపకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని తెలియజేశారు. రైతుల తరుపున నిలబడి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి చెరువులు, కుంటలు నింపే దాకా పోరాటం చేస్తామని తెలియజేశారు. బచ్చన్నపేట మండలంలో ఉన్న గ్రౌండ్ రిపోర్టును ఎమ్మెల్యే పల్లా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఇరిగేషన్ అధికారులతో నీళ్లు విడుదల చేసి అన్ని చెరువులు కుంటలు నింపాలని ఎమ్మెల్యే పల్లా మాట్లాడారని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రతి గ్రామంలో చెరువులను నింపాలని కోరారు