నూతన భవనంలోకి సెంట్రల్ బ్యాంకు తరలింపు…
జనగామ రోడ్డుకు పెట్రోల్ బంకు దగ్గర సెంట్రల్ బ్యాంక్
నేటి నుంచి(సోమవారం నుండి) ఇక్కడే బ్యాంకు సేవలు
––మేనేజర్ శంకర్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేటమండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బచ్చన్నపేట శాఖన ప్రస్తుతం సిద్దిపేట రోడ్డులోని చౌరస్తాలో ఉన్న బ్యాంకు బ్రాంచిని ఇంటి నెంబ 1- 16 ఎ జనగామ రోడ్డు లోని ఎస్సార్ పెట్రోల్ బంక్ ప్రక్కన గల ఆవరణలో కి మార్చడం జరిగిందని శాఖ మేనేజర్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా చౌరస్తా లో ఉన్నటువంటి శాఖ కార్యాలయం ద్వారా ఖాతాదారులు, మరిన్ని సదుపాయాలు కల్పించి నూతన భవనం లోకి శాఖ కార్యాలయాన్ని మార్చినట్లుగా తెలిపారు. నేటి నుంచి అనగా సోమవారం నుండిఖాత దారులు తమ యొక్క ఖాతాలను సులువుగా వినియోగించుకునేందుకు విశాలమైన ఆవరణ ఉందని తెలిపారు. ప్రతి ఖాతాదారుడు బ్యాంకు యొక్క సేవలను అందిపుచ్చుకోవాలని ఈసందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.