ప్రజల సౌకర్యం కోసం ఎంపీటీసీలను ఒక్కొక్క దాన్ని రెండు గా విభజించాలి
బిఆర్ఎస్ నర్సంపేట రూరల్ మండల కమిటీ డిమాండ్
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
నర్సంపేట రూరల్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం వీడుదల చేసిన ఎంపీటీసీ ల ఓటరు లిస్ట్ ప్రకారం
1.బాంజీపేట 1796 ఓట్లు
2.చేంద్రయ్య పల్లి 1909 ఓట్లు
3.రాజు పేట 2025 ఓట్లు
4.లక్నేపల్లి 2547 ఓట్లు
5.కమ్మ పల్లి 2813 ఓట్లు
6.ఇటుకాల పల్లి 4904 ఓట్లు
7.గురిజాల 6029 ఓట్లు
గా విభజించారని ఈ యొక్క ఎంపీటీసీ లలో గురిజాల అదేవిధంగా ఇటుకాల పల్లి స్థానాలు ఓట్ల పరంగా చాలా పెద్దగా ఉన్నాయనీ ఆయొక్క ఎంపీటీసీ స్థానాలను ఒక్కొక్క దానిని రెండు ఎంపీటీసీ లు చేయలని డిమాండు చేశారు.అభివ్రుది నిధుల కేటాయింపు లో ఎంపీటీసీ ల పరంగా నిధుల కేటాయింపు జరుగుతుంది కాబట్టి పెద్ద ఎంపీటీసీ లకు అభివ్రుది కీ ఆటంకం కలిగే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజల సౌకర్యం కోసం ఎంపీటీసీలను ఒక్కొక్క దాన్ని రెండు గా విభజించలని తెలిపారు.అదికారులు అప్రజాస్వామికంగా ఎంపీటీసీ ల విభజన చేశారని దానిని మరల పునఃపరిశీలన చెసి విభజించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,మోతే పద్మ నాభ రెడ్డి,మోటూరి రవి,కందుల రాజీ రెడ్డి,పుప్పాల బిమయ్య,దార రాజేందర్,పాశికంటి శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు