ప్రజలు ఆశీర్వదిస్తే…… సర్పంచ్ మరియు ఎంపీటీసీ బరిలో ఉంటాను కుమ్మెర వంశీకృష్ణారెడ్డి
—- *పెద్దపులి నాగారం గ్రామంలో రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయాలు*
*ప్రజాగొంతుక ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి. శ్రీకాంత్*)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో… సర్పంచ్… లేదా ఎంపిటిసి బరిలో నేను సైతం అంటూ… కుమ్మెర వంశీకృష్ణారెడ్డి, తెలియజేశారు.
గ్రామ ప్రజలందరికీ ముఖ్య గమనిక:—- గ్రామంలో మహిళలకు ఆడ కూతురు పుట్టినట్లయితే 20వేల రూపాయలు తక్షణమే అందజేస్తాను. పేదింటి కుటుంబ ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తెమెట్టలతో పాటు 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇంట్లో పరిస్థితులను బట్టి సంవత్సరానికి 50వేల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. క్రీడాకారులకు ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తానని తెలియపరిచారు. ముఖ్యంగా అనివార్య కారణాలవల్ల ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాళ్లను తక్షణమే ఆదుకుంటాను. అంటూ రాజకీయాన్ని ఘాటుగా ఓ మలుపు తిప్పుతున్న వంశీకృష్ణారెడ్డి, ఎస్సీ కమ్యూనిటీ హాల్లో అన్న సమస్యలు మొత్తం తీర్చేస్తాను గ్రామంలో ఉన్న ఇతర సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను అని తెలియజేశారు