స్థానిక సంస్థ ఎన్నికల్లో గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఇవ్వండి.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 13 :
స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేజ్ 2 ఆఫీసర్స్ డ్యూటీ వేయడంలో సీనియారిటీని ప్రాతిపదికనగా తీసుకోవాలని ఆరోగ్య సమస్యలు, గర్భిణీ స్త్రీలను ఎలక్షన్ డ్యూటీ ల నుండి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ శివంపేట మండల శాఖ పక్షాన ఎంఈఓ బుచ్చా నాయక్ గారినీ, ఎంపిడిఓ ను కలసి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మెమరండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు డాక్టర్. చక్రుసింగ్, ప్రధాన కార్యదర్శి కనకరాజు, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ సంతోష్, జిల్లా నాయకులు శ్రీనివాస్, మండల నాయకులు పాల్గొన్నారు.