సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం
కాంగ్రెస్ పాలనలో పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు…..
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ధనవంతులు తినే సన్న బియ్యం పేదలకు ఇందిరమ్మ ప్రజా రాజ్యం లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి తెచ్చి, సన్న బియ్యం పంపిణి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండలం అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి అన్నారు. జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి ఆదేశానుసారం బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని గోపాల్ నగర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గణపురం నాగేష్ ఆధ్వరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో సన్నబియ్యం తేవడం జరిగిందని,ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన లో పేద ప్రజలకు సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు.ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఇదే సన్న బియ్యం మార్కెట్లో కొనాలంటే కిలో రూ,50 నుంచి రూ,60 లు ధర ఉందన్నారు.ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ షాప్ ల ద్వారా పంపిణి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.ఎన్నికల హామీలో లేకున్నా పేద ప్రజల కోసం సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పర్వతం యాదగిరి,పస్తం పోచయ్య, వద్ది ఎల్లయ్య,సిరిపాటిరామదాస్,నాగభూషణం ,పిట్టల రాములు, చింతల కర్ణాకర్,గంగర బోయిన ఐలయ్య, జనార్ధన్,వల్లలసత్యనారాయణ,,నీలజంపెయ్య,మామిడాల నరసింహులు, సోలా బాలరాజ్, మామిడాల నర్సింలు, , అనంతం, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ మాల, రేషన్ డీలర్ వల్లాల ప్రసన్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.