దుర్గమ్మ ఆలయానికి విరాళం అందజేసిన పబ్బ మహేష్ గుప్తా.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,ఫిబ్రవరి 17:
మెదక్ జిల్లా.శివంపేట మండల కేంద్రంలో దుర్గమ్మ గుడి వద్ద ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి 10,0000 అక్షరాల లక్ష రూపాయలు, విలువ రేకుల షెడ్డు పనులను ప్రారంభించారు గతంలో వారి తాత పబ్బ అంజయ్య గుప్తా దుర్గమ్మ గుడి నిర్మాణం ఈ హయాంలో తన సొంత నిధుల నుండి తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా రేకుల షెడ్డు పనులు ప్రారంభించారు.
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త మాట్లాడుతూ నాకు తోచిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రాజుపేట పద్మా వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య, సీనియర్ నాయకులు బాసంపల్లి రామ గౌడ్ వంజరి కొండల్,పోచ గౌడ్, కోవూరి వెంకటేష్, దొడ్ల అశోక్, ముయ్యడి సింహం, కమలయ్య గారి లక్ష్మీనారాయణ, పైనం యాదగిరి, వరగంటి రమేష్ గుప్తా, త్రినేష్ గౌడ్ ఖదీర్ సాయి,వజ్జ హరి,రేవంత్ తిరుపతి, నవీన్, పంభాల అజయ్, బాలు ముద్దగల దుర్గేష్,ముత్యాలు, బలరాం అంజి, పిఎంజి యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.