Wednesday, March 19, 2025

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం ధర్మ రక్ష ఫౌండేషన్ చైర్మన్

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం ధర్మ రక్ష ఫౌండేషన్ చైర్మన్—- అనుముల నవీన్ కుమార్

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:18

నల్లగొండ జిల్లా నాగర్జున సాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం మారుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందన్నగూడెం గ్రామంలోని దళిత మరియూ నిరుపేద కుటుంబానికి చెందిన మాడుగుల వెంకటయ్య కుమారుడైన కోటేష్ కు చెవులు సరిగా వినపడవు. ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేంత స్తోమత లేకపోవడంతో ఇట్టి విషయాన్ని ఫౌండేషన్ మండల సభ్యులైన పోలే రవి మరియు నిరుడు సురేష్ ల ద్వారా తెలుసుకున్న ధర్మ రక్షా ఫౌండేషన్ చైర్మన్ అనుముల నవీన్ కుమార్ సభ్యుల సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం 5,000రూ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ధర్మరక్ష ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటుందని, తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాధ్యమైనంత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటామని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధూప దీప నైవేద్యం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, గోవిందన్నగూడెం మరియు మారుపాక గ్రామ యువత సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మేదరి సైదులు, ఫౌండేషన్ త్రిపురారం మండల ప్రధాన కార్యదర్శి గండికోట గోపీచంద్, నిడమనూరు ఫౌండేషన్ సభ్యులు కృష్ణ, పోలే రవి, నిరుడు సురేష్ మరియు గ్రామ ఫౌండేషన్ సభ్యులు రవి, గణేష్ శంకర్ ప్రశాంత్ ప్రవీణ్ నవీన్ నరసింహ శేఖర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp