అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సర్వే
భూతం అరుణకుమారి —ఐద్వా పట్టణ కార్యదర్శి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి:నల్లగొండ జిల్లా: మార్చి:21
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం ఎస్ ఎల్ బి సి లో సర్వే నిర్వహిస్తు ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చూసినట్లయితే
1) అంగన్వాడి కేంద్రం నిర్వహించాలి.
2) రేషన్ షాపు లేదు
3) మిషన్ భగీరథ మంచినీళ్లు రావటం లేదు
4) మోరీలు లేవు
ఎలక్షన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ సమస్యలు సమస్యలు లాగానే ఉంటున్నాయి. ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకున్న ప్రజలు సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ గతంలో కూడా మేము ఇక్కడ అంగన్వాడి కేంద్రం నిర్వహించాలని మెమొరండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా ఇక్కడ సమస్యలు అర్థం చేసుకొని వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్న మహిళకి పింఛన్ రావడం లేదు పింఛన్ రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పర్వీన్, సైదాబీ, సన, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.