లింగంధన గ్రామంలో ఎస్సీ వాడలో డ్రైనేజ్ పనుల ప్రారంభం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామాభివృద్ధికి మరొక ముందడుగు
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో (ఆర్.ఆర్.గౌడ్)
కేశంపేట మండలం లింగంధన గ్రామంలోని ఎస్సీ వాడలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు ఈ అభివృద్ధి పనుల ప్రారంభాన్ని హర్షిస్తూ, నిధుల మంజూరుకు ఎమ్మెల్యే శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేశంపేట మండల ప్రధాన కార్యదర్శి బండెల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తోంది.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి పథకాలను కొనసాగిస్తోంది.రు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాంరెడ్డి,మాట్లాడుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో లింగంధన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు.,గ్రామ కార్యదర్శి శ్రీశైలం,సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి,మండల ఎస్సి సెల్ ప్రెసిడెంట్ భాస్కర్,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎన్. బాలయ్య,ఎన్. పురుషోత్తం, కమ్మదనం. నరేందర్ రెడ్డిఎన్. నర్సింలు,ఎన్. యాదయ్య,ఎన్. రాజు,ఎన్. శ్రీశైలం,ఎన్. వినయ్,ఎన్. ఇస్తారి,జి. ప్రశాంత్,ఆర్. సత్యం,ఎన్. ప్రశాంత్ తదితరులు.గ్రామస్థుల ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కృషిని కొనియాడారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా చేపట్టిన ఈ డ్రైనేజ్ పనులు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.