కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
మచ్చలేని నాయకుడు, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే అండదండలైన నాయకుడు, జనగామ ప్రాంత అభివృద్ధి ప్రదాత,జనగామ డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మీడియా ద్వారా కోరారు. గోపాల్ నగర్ గ్రామంలో ఈ సందర్భంగా బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశానుసారం వారు మాట్లాడుతు జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కార్యకర్తలను కాపాడుకుంటూ, జనగామ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు అని అన్నారు. కాంగ్రెస్ వాదిగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం… పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి , మంత్రిగా నియమించాలని ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోపాల్ నగర్ గ్రామ నాయకులు వల్లల సత్యనారాయణ,వద్ది ఎల్లయ్య, పస్తం పోశయ్య, చింతల కర్ణాకర్,నీల నవీన్, జంపయ్య, తదితరులు పాల్గొన్నారు