స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపిని ఆశీర్వదించండి
మండల అధ్యక్షురాలు బూర్గోజు స్వరూప
ప్రజా గొంతుక కొమురవెల్లి మండలం
ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ గ్రామంలో గ్రామ శాఖ 13,14వ బూత్ అధ్యక్షులు శ్రీరాముల ప్రకాష్,దండు బాలచందర్ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి కొమరవెల్లి మండల అధ్యక్షురాలు బూర్గోజు స్వరూప గ్రామస్తులతో వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన ఈరోజు గ్రామాలలో అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోటే జరుగుతున్నాయని యువకులు మహిళలు రైతులను అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపిని ఆశీర్వదించాలని కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో శక్తి కేంద్ర ప్రబారి పుట్ట కనకయ్య మండల కార్యదర్శి కొంతం రాజు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బచ్చలి రాజు మండల కార్యవర్గ సభ్యులు తేలు కనకరాజు తదితరులు పాల్గొన్నారు