పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందరూ తప్పకుండా సద్వినియోగ పరుచుకోవాలి – నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి
దుగ్గొండి మండల గిర్నిబావి జిఆర్బి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ,
మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు గారు మరియు మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడుతూ,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ల కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని వెల్లడించారు,మన దుగ్గొండి మండల యువతీ,యువకులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోడానికి అందరూ కూడా దరకాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు,ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసి డైరెక్టర్,వర్కింగ్ ప్రెసిడెంట్,క్లస్టర్ ఇంఛార్జ్ లు,తాజా మాజీ సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు మరియు నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు పాల్గొన్నారు.