Saturday, March 15, 2025

నందిగామ దళిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

– *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య*

ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో

నందిగామ దళిత రైతులు 18 రోజులుగా భూస్వాముల అక్రమాలపై పోరాటం చేస్తున్నారని, వారికి సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలుతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. నందిగామ రైతుల భూములను అక్రమంగా ఆక్రమించిన భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.భూమి పేదల హక్కు – ఆక్రమణలు అడ్డుకుంటాం,జంగయ్య, పర్వతాలు మాట్లాడుతూ లంకాల నారాయణరెడ్డి భూదాన బోర్డుకు రాసిచ్చిన భూమిని దళిత రైతులకు అప్పట్లో పంపిణీ చేశారు. కానీ, మేకగూడా గ్రామానికి చెందిన కే. నారాయణరెడ్డి ఫ్యామిలీ అక్రమంగా పేదల భూమిని ఆక్రమించుకోవడం దుర్మార్గం అని అన్నారు.పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించడం హేయమైన చర్య అని, రైతులకు న్యాయం జరుగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు రికార్డుల ద్వారా భూమిని కాజేయాలని చూస్తే, భూ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. “ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నేతలు – రైతుల పక్షాన ఉంటారా లేదా దోషులను కాపాడుతారా?” అని ప్రశ్నించారు.రాష్ట్ర రెవెన్యూ మంత్రి అవసరమైతే, ముఖ్యమంత్రిని కూడా కలవడం జరుగుతుందని తెలిపారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళతామని, రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని హామీ ఇచ్చారు.వినతిపత్రం సమర్పించిన వారిలో రైతులు శ్రీను, వెంకటయ్య సహా పలువురు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp