తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు వాయిదా
*ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ణయం*
*ప్రజా గొంతుక హైదరాబాద్*
*ఈ మేరకు లేఖ నం. G/214/2025, తేదీ: 01.03.2025 ను విడుదల చేసిన కమిటీ*
*ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నియమించిన కమిటీకి సహకరించకుండా ఎన్నికలు కొనసాగించడం నియమ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కమిటీ అభిప్రాయపడింది.*
*మహాసభ అధ్యక్ష ఎన్నికల విషయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై అవసరమైన బైలాస్ ఇతర సమాచారాన్ని ఇవ్వాలని మహాసభ నిర్వాహకులను కమిటీ కోరింది.*
*మహాసభ కార్యాలయంలో ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిటీకి తగిన గదిని ఏర్పాటు చేయాలని సూచించింది*
*మహాసభ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు ఎన్. సైది రెడ్డిని ఎన్నికల అధికారిగా, ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావును మరియు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్, జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.*
*ఈ కమిటీ, సహజ న్యాయ సూత్రాల ఆధారంగా అన్ని అంశాలలో తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించనుంది.*
- *ఈ ఉత్తర్వులను మహాసభ నోటీసు బోర్డు పై అతికించడమే కాక, ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశిస్తూ, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రతిపాదించిన ఎన్నికల అధికారి చంద్ర పాల్ కి అందించింది.*