దేవాలయాల పవిత్రతను కాపాడుకుందాం.
*జాతర(ఉత్సవాల)లలో మధ్యం,మాంస విక్రయాలను అరికట్టండి.*
*యువసత్తా అధ్యక్షులు లక్ష్మణ్ పిలుపు.*
ప్రజా గొంతుక /రంగారెడ్డి,ఫిబ్రవరి 24:
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు,మధ్యం తాగటం తప్పని ఎలా హెచ్చరిక బోర్డులను పెట్టి చెబుతారో పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో కూడా మాంసం,మధ్యం విక్రాయాలు అమ్మడం నేరమని అవగాహనా కలిగేలా చూసి ఆలయాల పవిత్రతను కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులను,సంబంధిత పోలీస్ అధికారులను కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్…దేవాలయాల్లో మద్యం,మాంసం విక్రయాల పై మీడియా ద్వారా కోరుతున్నారు.ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ మండలం రాయికల్ వద్ద కొలువై ఉన్న అమర లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభమైన జాతర(ఉత్సవాల)లలో మద్యం,మాంస విక్రయాలపై ఘాటుగా స్పందించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ,,,హిందూవుల పండుగ,పవిత్రమైన పుణ్య క్షేత్రమైన రామేశ్వరం ఆలయం మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకొని చుట్టు పక్కల నుండే కాకుండా ఉమ్మడి జిల్లాలతో పాటుగా అటు నాగర్ కర్నూల్,వనపర్తి,ఇటు హైదరాబాద్,వికారాబాద్ నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి,దర్శనం కోసం వస్తుంటారని అన్నారు.ఇదే అదునుగా(సాకుతో)చాలామంది వ్యాపారం పేరుతో ఆలయం వద్ద దొంగ చాటుగా మద్యం,మాంస విక్రయాలు నిర్వహించడం జరుగుతుందని,దీంతో భక్తులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బందే కాకుండా ఆలయం పవిత్రతను దెబ్బ తీసేలా ఉంటుందని మండిపడ్డారు.దేవాలయం సమీపంలో మాంసం లేదా మద్యం దుకాణాలు ఉండకుండా,మాంసం అమ్మకాలు,విక్రయాలు జరుగకుండా ఆలయ పవిత్రతను కాపాడుతూ,భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
*ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులకు సహకరిద్దాం.*
మహాశివరాత్రి పర్వధీనాన దేవాలయానికి వచ్చే చిన్న,భారీ వాహనదారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ఉండాలని,ప్రశాంతమైన మరియు గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించాలని వాహనదారులను కోరుకుంటూన్నారు..పండుగల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,కొంతమంది దుండగులు ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని,ప్రజా భద్రత మరియు సౌలభ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ముఖ్యంగా ఆలయ కమిటీదేనని సూచించారు.మహాశివరాత్రి అందులోను హిందూవుల ఆరాధ్య దైవం,కొట్లాది మంది భక్తులు నమ్మి కొలిచి వచ్చే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి అటు ఆలయ కమిటీ,ఇటు అధికారులు అప్రమత్తం గా ఉంటూ భక్తులు,ప్రజలను,దేవాలయం పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..సాయంత్రం,తెల్లవారుజామున భక్తులు దర్శించుకునే సమయంలో పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించే అవకాశం ఉంది,కావున అధికారులు వాటాదారులు దేవాలయానికి వచ్చే భక్తులు,ప్రజలతో మంచిగా ప్రవర్తించేలా చూసుకోవాలని కోరారు యువసత్తా యూత్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్…*SB*✍️