ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి లో గుర్తుతెలియని మహిళ శవం
ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం
గోదావరిఖని గత 06 రోజుల క్రితం గోదావరి నది ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించడం జరిగింది. మహిళ ఆరోగ్యం మరియు మానసిక స్థితి బాగాలేదు. చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి లో గుర్తుతెలియని మహిళ శవంభద్రపరచడం జరిగింది. ఇట్టి మహిళ యొక్క వివరాలు తెలియరాలేదు కావున ఫోటో లో ఉన్న మహిళ ను ఎవరైనా గుర్తిస్తే గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి 8712656516 లకు సమాచారం అందిచగలరు.