సిద్దేశ్వరుడి కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కోడవటూరు గ్రామం స్వయంభు సిద్దేశ్వర స్వామి సిద్దులగుట్ట మహా బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి మాజీ సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. సందర్భంగా రేపు అనగా బుధవారం రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రానున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు, సామాజికవేత్త చల్ల శ్రీనివాసరెడ్డి ,ఎంపిటిసిల పోరం మండలం మాజీ అధ్యక్షుడు దూడల కనకయ్య గౌడ్, ఈదులకంటి ప్రతాపరెడ్డి, ఎండి షబ్బీర్, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.