బాధిత కుటుంబాలకు అండగా యశ్వ ఫౌండేషన్
—– యశ్వ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. పల్నాటి నరేష్ నేత
*ప్రజా గొంతుక ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్*):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో యశ్వ ఫౌండేషన్ పల్నాటి నరేష్ నేత ఆధ్వర్యంలో…. పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన దారా వెంకటమ్మ, ఇటీవల తన భర్త అనారోగ్య కారణం వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయని. యశ్వ ఫౌండేషన్ అధినేతకు సమాచారం అందజేసిన వెంటనే 2500 రూపాయలు చేతి ఖర్చులకోసం మరియు 50 కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో…. ఫౌండేషన్ సభ్యులు… వెంకటేష్ యాదవ్, కే శ్రీకాంత్, శ్రీశైలం, శివ, నందు, శ్రీకాంత్, పాల్గొన్నారు