రాహూల్ గాంధీ, సోనియా గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు..
కులగణనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం..
– పీసీసీ సభ్యులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బచన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి.
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ రాహూల్ గాంధీ, సోనియా గాంధీ లు చాలా కాలంగా డిమాండ్ చేయడం జరిగింది . ఎట్టకేలకు ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో కాంగ్రెస్ డిమాండ్ కు ఓకే చెప్పింది మోడీ సర్కార్.దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కులగననకు అంగీకారం తెలిపిందని కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఒక్క విప్లవాత్మకమైన చర్యగా తాను అభివర్ణిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 2025లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ తో కేంద్రం నిర్ణయించింది . క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయంతో 94 ఏళ్ళ తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి.1931 లో కులగణన తర్వాత 2011 దాకా కులగణన జరగలేదు. 2011లో సామజిక ఆర్థిక కులగణన చేపట్టినప్పటికీ అది పూర్తిస్థాయి కులగణన కాదని విమర్శలున్నాయి. ఈ సర్వేలో సమగ్ర కులజాబితా వెల్లడించలేదని విమర్శలున్నాయి.దేశవ్యాప్తంగా బీసీ కులగణన పట్ల రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బచన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, జిల్లా సందీప్, మాజీ ఎంపీటీసీ నీల రమేష్, హరి క్రిష్ణ, మ్యాకల రమేష్, అఖిల్ మాల, యూత్ కాంగ్రెస్ జనగామ మండల ఉపాధ్యక్షులు బక్క ప్రవర్ధన్,అజయ్, రాములు తదితరులు పాల్గొన్నారు.