కబడ్డీ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలి
స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి 08,(మన సాక్షి గొంతుక) :
స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పామునురు గ్రామంలో పామునూరు యూత్ అసోసియేషన్స్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని ఆర్గనైజర్స్ ఎండీ సఫ్ఫిర్, కె భరత్, ఎస్ కె అజిత్ తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్స్ అనుమతితో పామునురు గ్రామంలో ఫిబ్రవరి 14, 15, 16 న కబడ్డి పోటీలను గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటికి తీయాలనే లక్ష్యంతో కబడ్డి క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 40వేలు, రెండవ 30వేలు, మూడవ 25వేలు, నాల్గవ 20వేలు, ఐదవ 15వేలు, ఆరవ 10వేల నగదుతో పాటుగా మెమెంటోను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు ఎండి సఫీర్, పోలెపల్లి సంపత్ రెడ్డి, డాక్టర్ పొన్న బీరయ్య, కోతి రాములు, ఇనుగాల రాజిరెడ్డి, ఇనుగాల యుగేందర్ రెడ్డి, మాదిరెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.