ఫర్నిచర్ షాప్ లోకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్…
ప్రజా గొంతుక డెస్క్ యాదాద్రిభువనగిరి జిల్లా:
ఆలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఉడెన్ ఫర్నిచర్ వర్క్ షాప్ లోకి ఇసుకలోడుతో వెళుతున్న ట్రాక్టర్ దూసుకెళ్లింది.వివరాల్లోకి వెళితే…మీ సేవ కు వెళ్ళి తన పని పూర్తి చేసుకుని రోడ్డు పై నుండి వెళ్తున్న మహిళను ట్రాక్టర్ ఢీ కొట్టి,షాప్ ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీ పై నుండి షాప్ లోకి ట్రాక్టర్ దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటన లో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్క సారిగా షాప్ లోకి ఇసుక ట్రాక్టర్ దూసుకు రావడంతో షాప్ లో పని చేస్తున్న పనివాళ్ళు పరుగులు తీశారు.గాయపడ్డ మహిళను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్, డ్రైవర్ల ఫిట్నెస్ ల పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా ఆలేరు పోలీసులు.