శ్రీ పంత్ సేవాలాల్ ఉత్సవాలకు ఆర్డీవో ని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
నర్సంపేట మాధన్న పేట రోడ్డు లో గల శ్రీ పంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు 15-02-2025 రోజున జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ ప్రధాన కార్యదర్శి అజ్మీర శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్ డి ఓ ని ఆహ్వానించారు.ఈ సందర్భంగా భూక్య గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా విచేస్తున్నారు. కావున అధికారులు గిరిజన నాయకులు గిరిజన సోదరులు మహిళ సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు..