బిఆర్ఎస్ సైనికులారా కదలిరండి
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
బచ్చన్నపేట మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ పిలుపు….
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మండల బి ఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు వారు మాట్లాడుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అణిచివేత వేయబడుతున్న మన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు 27 ఏప్రిల్ 2001 లో టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఎన్నో ఉద్యమాలు నడిపించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలువంచి 2014లో ప్రత్యేక తెలంగాణ కెసిఆర్ సారధ్యంలో సాధించుకున్నాం ఏర్పడిన తెలంగాణని బంగారు తెలంగాణ కావాలని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు అందించిన ఘనత కేసీఆర్ దని అన్నారు. తెలంగాణని అన్ని రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినఘనత కేసిఆర్ ది కానీ నేడు ఆచరణ అమలు కానీ హామీలు ఆరు గ్యారెంటీలు 420 హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు 15 నెలలు అయినా కూడా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో విఫలం చేస్తూ అధికారం అంటే అవినీతి అనే చందంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో దివాలా తీస్తుంది కావున ప్రజలందరినీ మేల్కొని మళ్లీ సారే రావాలి కేసీఆర్ కావాలి అంటూ గ్రామ గ్రామాన రేపు ఉదయం 9 గంటలకు పార్టీ జెండాలను ఎగురవేసి బస్సులలో ప్రజలు ఉవ్వెత్తున బయలుదేరి వరంగల్లో ఎల్కతుర్తి జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభ జయప్రదం చేయాలన్నారు.