లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,జూన్ 13:
మెదక్ జిల్లా. శివంపేట మండలం, దొంతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎంపికైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగారి శ్రీనివాస్ మరియు చుక్క శ్రీనివాస్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీకాంత్,సత్యనారాయణ స్వామి,రాజు స్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.