బొమ్మకూరు డ్యాం నుండి తపస్పల్లి డ్యాంకు కు నీళ్లు విడుదల.
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న..
ప్రజా గొంతుక జనగామ నియోజకవర్గం
బచ్చన్నపేట , చేర్యాల కొమరవెల్లి ,మండలంలో పలు గ్రామాల చెరువులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నాయని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేయడంతో వారు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి నీళ్లు అందించడానికి బొమ్మకూరు డ్యామ్ కు నీటిని విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న మాట్లాడుతూ జనగామ అభివృద్ధి ప్రదాత డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మంత్రులతో మాట్లాడి నీటిని తపస్పల్లి డ్యామ్ కు పంపింగ్ , నీళ్లు విడుదల చేయడం జరిగింది అని (పంపింగ్ మొదలైందని) తెలియజేశారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి,,జంగిటి విద్యనాథ్,అల్వాల ఎల్లయ్య, పెద్దపాటి కరుణకర్ రెడ్డి,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.