Saturday, March 15, 2025

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి

——సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ.

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి07

ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 26 వేల కనీస వేతన అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే కార్మిక ఖాతాలో వేస్తామన్న వేతనాలు రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిడమనూరు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందర మేం అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తాం అర్హత కలిగిన వాళ్ళను పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయకపోగా నెలలు తరబడి వేతనాలు పెండింగ్ లో ఉంటున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలతో చాలీచాలని వేతనాలతో అవి సకాలంలో రాక గ్రామపంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాపాలనలో పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని అర్హత కలిగిన వాళ్లను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో కార్మికులను వేధింపులను గురి చేస్తున్నారని వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కోటేష్, నాయకులు శేఖర్, గ్రామపంచాయతీ కార్మికులు శ్రీను ,ఉదయ్, విజయ్, క్రాంతి, రాములు, వెంకటమ్మ, సైదమ్మ, మైసయ్య, సైదమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp