కూలిన విమానం మృతులకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి…..
బొజ్జ చిన్న మాదిగ.
ఎమ్మార్ పీఎస్,దేవరకొండ మండలం ఇన్చార్జి.
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:13
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయిన ఘోరమైన ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భందతికి గురిచేసింది.గాలిలోకి ఎగిరిన విమానం అతి కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఘోరంగా ప్రమాదానికి గురికావడం అత్యంత విచారకరం విమానం కుప్పకూలిన మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న దారుణ పరిస్థితి నీ చూస్తుంటే ప్రతి ఒకరి ఉదయం తీవ్రంగా కలిసి వేస్తుంది. విమానంలో ప్రయాణం చేస్తున్న వారిలో ఒకరు మినహా మిగతా వారంతా మృతి చెందడం అత్యంత విచారకరం వారికి నివాళులు తెలుపుతున్నాము వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఈ ఘటనలో వైద్య విద్యార్థులు కూడా ప్రమాద బారిన పడడం విచారకరం ఈ ప్రమాదంలో గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రమాదం ఏ నిర్లక్ష్యం వల్ల జరిగిందో ఇందులో ఏ లోపం ఉన్నదో ఈ ఘటనకు కారణం ఏమిటో మొదలుకొని విషయాల మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాలి ఈ ఘటనకు పూర్తి బాధ్యత టాటా గ్రూపు కంపెనీ బాధ్యత వహించాలి కృతజ్ఞతలు తెలుపుతూ. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం. గాయపడిన వారిని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతు ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం
కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. .