Tuesday, July 8, 2025

సీఎం రేవంత్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం..

బీసీ బిల్లు కలను సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

ప్రజా గొంతుక/బచ్చన్నపేట మండలం

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేసినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి రెడ్డి చిత్రపటాలకు ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో పాలభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి నాయకులతో కలిసి పాల్గొని పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి నిర్ణయించుకొని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మాజీ మార్కెట్ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి, జిల్లా సందీప్, జంగిటి విద్యనాథ్, ఇజ్జగిరి రాములు, ఆముదాల మల్లారెడ్డి, పిన్నింటి నారాయణరెడ్డి ,గిద్దల రమేష్, గణపురం నాగేష్, మల్లవరం అరవింద్ రెడ్డి, సూత్రపు రమేష్, పెనువెల్లి వెంకన్న, కూరాకుల రవి, జంగిటి నరేష్, నల్ల మహేందర్ ,చింతల కర్ణాకర్, కర్రె నరేష్, మాజీ ఉప సర్పంచ్ హరికృష్ణ,బొట్టు సుధాకర్, అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp