దైవభక్తి చాటుకున్న జంగిటి విద్యనాథ్
బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి 30000 విరాళంగా అందజేత...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం ,తమ్మడపల్లి గ్రామంలో బీరప్ప కళ్యాణ మహోత్సవానికి సామాజిక సేవకర్త, కాంగ్రెస్ నాయకులు జంగిటి విద్యనాథ్ విరాళం అందించారు. తమ్మడపల్లి గ్రామంలో త్వరలో జరగబోయే శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి తన వంతు సహాయంగా 30000 రూపాయలు తమ్మడపల్లి గొల్ల కురుమ సంఘానికి అడిగిన వెంటనే అందించారు. ఈ సందర్భంగా వారు ఆ బీరప్ప ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని, బీరప్ప కళ్యాణానికి రావలసిందిగా కోరారు. కార్యక్రమాల్లో తాజా మాజీ సర్పంచ్ మేకల కవిత రాజు, కోడవటూర్ మాజీ డైరెక్టర్ స్థానిక రాజు ,పెద్ద కురుమ మేకల మల్లేశం, గొరిగే బాలరాజు, మేకల మహేష్ పాల్గొనడం జరిగినది.