కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు
మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
అందించిన గంగం సతీష్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ,రామచంద్రపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త, సుంకె నగేష్ మృతదేహానికి బచ్చన్నపేట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఒక కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని , ఈ సందర్భంగా గంగం సతీష్ రెడ్డి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలను అందించారు. సందర్భంగా మాజీ ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు, మండల ఉపాధ్యక్షుడు ఎండి జావేద్, కోనేటి స్వామి ,షబ్బీర్ , ముసిని రాజు, జలంధర్, ఇంద్రారెడ్డి, నాగరాజు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.