Saturday, March 15, 2025

శివ ఆరాధనతో మనిషికి మోక్షం

శివ ఆరాధనతో మనిషికి మోక్షం

*మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*

*శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు*

*షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వై. అంజయ్య యాదవ్*

*సకలజనులు సంతోషంగా ఉండాలని లింగమూర్తి ని కోరుకున్నట్లు పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే*

ప్రజా గొంతుక /షాద్ నగర్ (రాజమోని రవీందర్ గౌడ్)

శివారాధనతో మనిషికి మోక్షం లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మహాశివరాత్రి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం జాతర ఉత్సవాలలో భాగంగా మంగళవారం దేవాలయంలోని శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ప్రతి యేటా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ఘనంగా పూజలు జరపడంతో పాటు జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం మన హిందూ ధర్మానికి నిదర్శనమని, మన ప్రాంత ప్రజల ఐక్యతకు సూచిక అని పేర్కొన్నారు. మహాశివరాత్రి హిందువులకు ప్రత్యేక పర్వదినం అని, ఆ రోజున శివుని ఆరాధిస్తే మోక్షం లభించడంతోపాటు ఆ వ్యక్తికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ఉపవాసం అంటూ శివనామ స్మరణలో లీనమై ఉంటారని, ఈ పరిణామం మన భక్తికి, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శ్రీ రామలింగేశ్వర స్వామి కృప వల్ల నియోజకవర్గ ప్రజలు, రైతులు సంతోషంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని లింగమూర్తి ని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర మహోత్సవాలలో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, పీఎసీఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, నాయకులు వీరేశం గుప్తా, హరి గౌడ్, మాజీ సర్పంచులు రంగయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, చందు నాయక్, చంద్రశేఖర్, స్థానిక నాయకులు జనార్దన్ గౌడ్, రాజు యాదవ్, కిట్టు పంతులు, వాసు పంతులు, లింగం, రాములు, వెంకటేష్, ఆనంద్, గుండు అశోక్, కంది రాఘవేందర్ గౌడ్, పులిజాల నవీన్, దుమ్మని నవీన్, వెంకటేష్ గుప్తా, ఆంజనేయులు, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, సంజు నాయక్, సాయి యాదవ్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp