ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకు హరీష్ రావు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో చెంపపెట్టు.
జిల్లా జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు మన్సూర్.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 20 :
ప్రశ్నించే గొంతుక హరీష్ ని అణిచివేయలని చూసిన సీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది.ప్రజల కొరకు నిరంతరం పోరాడే నాయకుడిని అణిచివేయలనే కపట బుద్ధి ఇక కట్టి పెట్టు హరీష్ రావు గారి చిట్టచివరి బొటన వేలు వెంట్రుక కూడా పీకాలేరు అని ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటది.రేవంత్ రెడ్డి కి కంటిలో నులుసు లా మారి ప్రతిరోజూ ప్రభుత్వాన్ని అడిగి కడుగుతున్న హరీష్ రావు పై ఈ ప్రభుత్వం సీఎం అక్రమంగా పెట్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బోగస్ అని హై కోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది.ఉద్యమకారుడు ప్రజా నాయకుడు హరీష్ రావు ని ఎంత అణిచివేయాలని చూస్తే, ఆయన అంత ఎత్తుకు ఎదుగుతారు తప్పు, ప్రజల కోసం పోరాటం చేయడంలో రాజీ పడరు. మీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసుకు అస్సలు భయపడరు.హరీష్ రావు మీకు ప్రజాక్షేత్రంలో గోరి కట్టుడు ఖాయం ఇక కాస్కో రేవంత్, మెదక్ జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ హెచ్చరించడం జరిగింది.