చదువుకు ప్రోత్సాహం అందించిన… ఎన్ సి ఎం ఫౌండేషన్
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: హాలియా: ఫిబ్రవరి:28
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో గల నాలుగో వార్డ్ కి చెందిన కేసాని రమణయొక్క కుమార్తె అయిన కేసాని ప్రసన్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.కావున తన ప్రాజెక్టుకు లాప్టాప్ లేక ఇబ్బంది పడుతున్నదని తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు లాప్టాప్ ఇవ్వవలసిందిగా యన్ సి ఎం ఫౌండేషన్ చైర్మన్ నల్గొండ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన చైర్మన్ ఫౌండేషన్ తరపున తనకు కావాల్సిన లాప్టాప్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా అందజేయడం జరిగింది..ఇట్టి కార్యక్రమంలో యన్ సి ఎం ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది..