Saturday, March 15, 2025

గుండెపోటుతో ఆటో కార్మికుడి మృతి..

ఆటో నడుపుతూనే జీవనం…

సొంత ఇల్లు లేదు.. బిడ్డ పెళ్లి కాలేదు..

అంతలోని గుండెపోటుతో ఆటో కార్మికుడి మృతి..

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆటో కార్మికుడు గుంటి పల్లి శ్రీనివాస్ అకస్మాత్తు గుండెపోటు రావడంతో మృతి చెందారు. రోజువారీగా జనగామ బచ్చన్నపేట రూట్ లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఫ్రీ బస్సులు కావడంతో ఆటో కార్మికుడికి ఆర్థిక భారం పెరిగింది. అయినా వచ్చిన దాంట్లో కుటుంబం పోషిస్తూ బిడ్డ పెళ్లి చేయాలని, సొంత ఇల్లు నిర్మించుకోవాలని కష్టపడుతుండగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తన ఆటోలోనే ఆసుపత్రికి వెళ్లి అక్కడే మృతి చెందారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని బచ్చన్నపేట ఆటో యూనియన్ అధ్యక్షుడు పస్తం ఐలయ్య కోరారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు ఆటో కార్మికుడి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎద్దు రమేష్, సందెల లక్ష్మణ్ ,గౌటే సిద్ధులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్, లక్ష్మణ్ ,కరుణాకర్ తదితరులు ఉన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp