ఘనంగా వాణి విద్యానికేతన్ 30 వ వార్షికోత్సవం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ్రీ వాణీ విద్యానికేతన్ 30 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విద్యార్ధులు క్రమ శిక్షణతో చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని మండల విద్యాశాఖ అదికారి పరిటాల వెంకటరమణ అన్నారు.కళాశాల కరస్పాండెంట్ మైనేని పద్మజ అద్యక్షతన జరిగిన సభలో విద్యార్ధులు,తల్లిదండ్రులను ఉద్దేసించి ఆయన ప్రసంగించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంన్న వేల ఒక మహిళ నిర్వహిస్తున్న వార్షికోత్సవ సభలో ముఖ్య అతిదిగా పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు.మహిళా దినోత్సవం రోజున 30 వ వార్షికోత్సవం నిర్వహించడం అబినందనీయమన్నారు.శ్రీ వాణి విద్యానికేతన్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.పాఠశాల యాజమాన్యం పేద విద్యార్థులకు ఎటువంటి రుసుములను తీసుకోకుండా విద్యనందించడం హర్షనీ యమన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.విశ్రాంత ప్రదానోపాద్యాయుడు బివిఎస్-ఎల్ నరసింహారావు మాట్లాడుతూ పాఠశాలలో చదివిన విద్యార్దులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాద్యాయులు అభినంద నీయులన్నారు.ఉపాద్యాయులు బోదిస్తున్న పాఠ్యాంశాలను అర్ధం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకో వాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ చింతలపూడి వరలక్ష్మి,ఎంఈవో.ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.