లారీ టాటా ఏసీ బొలెరో ఢీ…
చెలరేగిన మంటలు పూర్తిగా కాలిపోయిన వాహనం…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం , అలింపురం గ్రామం విఎస్ ఆర్ నగర్ గ్రామాల మధ్యలో లారీ టాటా ఏసీ బొలెరో ఢీకొన్నాయి. టాటా ఏసీ లో ఉన్నటువంటి ముగ్గురి కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. టాటా ఏసీ బొలెరో వెహికల్ చాప పిల్లలను ప్యాకింగ్ ద్వారా తీసుకపోవటం ద్వారా అందులో ఉన్న ఆక్సిజన్ వలన లారీ,టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైనట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై హమీద్ తన పోలీస్ సిబ్బందితో కలిసి ముగ్గురిని చికిత్స నిమిత్తము జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. జనగామ నుండి ఫైరింజన్ వచ్చి మంటలను అర్పడం జరిగింది. ఇంక మిగతా సమాచారం తెలియాల్సి ఉంది.