కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల కార్యదర్శిగా దాచేపల్లి రాజయ్య..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి రాజయ్యను బచ్చన్నపేట మండల కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి మంగళవారం రోజున తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శిగా నియమితమైన దాచేపల్లి రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి సెక్రటరీగా (కార్యదర్శి) నియమించినందుకు జనగామ డి సి సి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న లకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కష్టపడతామని తెలియజేశారు.