ఎంఎల్ఎ బాలునాయక్కు మంత్రి పదవి ఇవ్వాలి
ప్రజా గొంతుక మార్చి 29 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ నియోజకవర్గ ఎంఎల్ఎ అభివృద్ధి సాధకులు నిరంతరం పార్టీ, కార్యక ర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ కోసం పనిచేస్తున్న దేవరకొండ ఎంఎల్ఎ నేనా వత్ బాలునాయక్కు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని దేవరకొండ మాజీ జెడ్పిటిసి మారుపాకుల అరుణసురేష్ గౌడ్ సిఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను కోరారు. శుక్ర వారం దేవరకొండలో స్థానికంగా వారు మాట్లాడుతూ మంత్రి వర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గంలో సీనియర్ ఎంఎల్ఎ, ఎంఎల్ఎగా అత్యంత మెజార్టీతో గెలిచి, పాల నపై అపార అనుభవం కలిగిన దేవరకొండ ఎంఎల్ఎ బాలునాయక్కు కచ్చితంగా మంత్రి వర్గంలో చోటు కల్పించి దేవరకొండ అభివృద్ధికి సిఎం రేవం రేవంత్రెడ్డి,
మంత్రులు ఉత్తమ్, వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారె డ్డిలు బాలునాయక్కు బాసటగా ఉండాలని కోరారు. సిఎం రేవంత్రెడ్డి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల వారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంటరీ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన విధానం మేరకు లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు.